భూముల్ని అడ్డగోలుగా అమ్ముతున్నారని, వైన్స్(Wines)లకు ముందుగానే టెండర్లు వేస్తున్నారని తాము అధికారంలోకి వస్తే వాటన్నింటినీ రద్దు చేస్తామని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. భూములకు వైన్స్ లకు డబ్బులు కట్టొద్దని, తాము గెలిస్తే అవన్నీ కోల్పోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైన్స్ లకు మళ్లీ టెండర్లు నిర్వహిస్తామన్నారు. పవర్ ఎప్పుడూ శాశ్వతం కాదని, మరో 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కేసీఆర్ కు తన మీద తనకు నమ్మకముంటే వచ్చే ఎలక్షన్లలో గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
జిల్లాల్లో సిట్టింగ్ MLAలు అందరికీ టికెట్లు ఇవ్వాలన్నారు. రానున్న ఎలక్షన్లలో BRS చిత్తుగా ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయన్న రేవంత్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు స్థలాలు లేవంటూ మరి పెద్దయెత్తున ల్యాండ్స్ ను ఎలా సేల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.