రైతులకు ప్రభుత్వం ఇక రుణమాఫీ చేయదన్న విషయం స్పష్టంగా అర్థమైందని, ఆ పార్టీ రైతులతో రాజకీయాలు చేస్తోందని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు బహిరంగ లేఖ రాసిన ఆయన.. KCR, KTR తీరును విమర్శించారు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోడు పట్టాలపై హడావుడి చేస్తున్నారని, 11.50 లక్షల మంది గిరిజనులు పోడు పట్టాలకు అర్హులని తేలితే కేవలం 4 లక్షల మందికే పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులకు 10 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని, సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే ఇందుకు ఎగ్జాంపుల్ అని తెలిపారు. నిజాలన్నీ బయటపెట్టడం వల్లే లాగ్ బుక్ లన్నీ సబ్ స్టేషన్ల నుంచి తెప్పించుకున్నారని అన్నారు.
ఆధారాలు బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కి పడిందని, ఫ్రీ కరెంటుపై BRS నాయకుల్ని రైతు వేదికలపై నిలదీయాలని ఫార్మర్స్ కు రేవంత్ సూచించారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.