లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ కలిసిపోయినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే ఎలక్షన్లలో అధికార పార్టీ BRSకు 25 సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రత్యర్థి పార్టీల విమర్శల్ని కొట్టిపారేస్తూ చంద్రబాబుకు సహచరుడినేనని.. ఆయనకు శిష్యుణ్ని మాత్రం కాదన్నారు. ‘నేను ఏ స్థాయిలో ఉన్నా తెలంగాణ వైపే ఉన్నా.. పార్టీలు మారినా తెలంగాణను మారలేదు.. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ భిక్షే.. కొండా లక్ష్మణ్ బాపూజీ కన్నుమూస్తే నివాళి అర్పించేందుకు కేసీఆర్ వెళ్లలేదని’ రేవంత్ విమర్శించారు.
గద్దర్ కు అసెంబ్లీలో సంతాపం తెలపలేదన్న పీసీసీ అధ్యక్షుడు.. ఆయన స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామన్నారు.
Nice…