ధరణి విషయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులే అసలు దళారులని.. KCR, KTR, హరీశ్ రావు, కవిత ఇందులో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తన తండ్రి సీఎం కావడం వల్లే KTR ఈ స్థాయిలో ఉన్నారని, ఆయన విదేశాల్లో IT నిపుణుడు అని చెప్పడం పెద్ద తప్పు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబంలో ఏనాడూ లేదని రేవంత్ గుర్తు చేశారు. 50 శాతం ఉన్న BCలకు BRS ఇచ్చిన సీట్లు మూడు అని, దీన్ని బట్టే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.
మూసీకి మాస్టర్ ప్లాన్
అధికారంలోకి వస్తే హైదరాబాద్ రోడ్లకు ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ చేపడతామని, మూసీ సుందరీకరణకు మాస్టర్ ప్లాన్ తయారు చేశామని రేవంత్ తెలియజేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై 2014 వరకు ఒక గుడ్ విల్ ఉండేదని, కానీ ఈ పదేళ్లలో ఆ గుడ్ విల్ కాస్తా జీరోగా మారిందని విమర్శించారు.