
Published 01 Dec 2023
ముఖ్యమంత్రి K.చంద్రశేఖర్ రావుకు ఓటమి భయం పట్టుకుందని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైతుబంధుకు ఇవ్వాల్సిన నిధులతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, అన్ని ప్రభుత్వ లావాదేవీల(Transactions)పై ఎన్నికల సంఘం నిఘా పెట్టాలని కోరారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్.. కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లకు హడావుడిగా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని భూములను బినామీలకు మళ్లిస్తున్నారన్నారు.
దీనిపై ఎలక్షన్ కమిషన్ ను కలిసి వివరిస్తామన్న PCC ప్రెసిడెంట్.. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమైనందునే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.