దేశంలో జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని, కేంద్రం ప్రకటించిన కమిటీ నుంచి కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బయటకు వచ్చినట్లు PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ప్రచారం చేసినా BJP గెలవలేకపోయిందని.. ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీదే అధికారమన్నారు. గాంధీభవన్ లో సమావేశం నిర్వహించిన ఆయన.. కమలం పార్టీ, BRSపై విమర్శలు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలకు కేసీఆర్ సర్కారు సిద్ధం కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించేది లేదని క్లారిటీ ఇచ్చారు.
BJP మాయమాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న రేవంత్.. ఓడిపోతామన్న భయంతోనే జమిలి ఎన్నికల నాటకమాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ జమిలి ఎన్నికల అంశానికి సంబంధించి గతంలో KCR సర్కారు నుంచి కేంద్రానికి పంపిన అంగీకార లేఖను ఆయన చదివి వినిపించారు.