తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం త్వరలోనే అడుగులు పడతాయని, అందుకు ఎంతోకాలం అవసరం లేదని చెప్పారు. దీపావళి సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న రేవంత్.. తెలంగాణకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ప్రపంచంతో పోటీపడేలా చూడాలని కోరుకుంటున్నానని, అతి త్వరలోనే అది జరుగుతుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు రెండు, మూడు విజయభేరి బహిరంగ సభల్లో పాల్గొంటున్న రేవంత్.. కొడంగల్ తోపాటు కామారెడ్డిలోనూ నామినేషన్లు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల గురించి రేవంత్ మాట్లాడటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే పాలన అంతా పక్క రాష్ట్రం నుంచే ఉంటుందని ఇప్పటికే BRS నేతలు ఆరోపిస్తున్నారు.