PCC ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ORR టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. ORR టెండర్లలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమాధానమివ్వాల్సిన సర్కారు స్పందించడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దీనిపై RTI కింద HMDAకు అప్లయ్ చేశామని, ఆ డిపార్ట్ మెంట్ నుంచి ఆన్సర్ లేదని అందులో వివరించారు. HMDA, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ను ప్రతివాదులుగా పిటిషన్ లో పొందుపరిచారు.
RTI కింద అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని రేవంత్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.