
వేల కోట్లు పలికిన కోకాపేట్, బుద్వేల్ భూములు కొన్నది ఎవరో కాదని, వారంతా కేసీఆర్ బినామీలేనని, అధికారంలోకి వచ్చాక యంత్రాంగంపై చర్యలు తీసుకుంటామని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘MPగా, PCC చీఫ్ గా ఉన్న నాకు సెక్యూరిటీ తీసేస్తారా.. సాక్షాత్తూ కోర్టు చెప్పినా భద్రతను ఇవ్వరా.. నేను ప్రజల అండతో ఇక్కడిదాకా వచ్చా, నాకు సెక్యూరిటీతో పనిలేదు.. పోలీసులు లేకుండా ఎక్కడికైనా వెళ్తా… కానీ KCR ఓయూ లేదా కేయూకు వెళ్లగలరా’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కు అడిగినంత సెక్యూరిటీ కల్పించామని, కానీ BRS పాలనలో పోలీసులు తొత్తులుగా మారారన్న ఆయన.. వారి పేర్లు రెడ్ డైరీలో రాస్తున్నట్లు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.