
సామాజిక తెలంగాణ కోసం లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులతోపాటు మేధావుల్ని కలుస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. అయితే ఆమె తన తండ్రికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని BRS నిర్ణయించింది. NDA, ఇండీ కూటమికి కాకుండా నోటా(NOTA)కు ఓటేయాలని భావించినా, ఆ ఆప్షన్ లేదు. కానీ ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత మాత్రం.. ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని సమర్థించారు. తద్వారా KCR నిర్ణయాన్ని వ్యతిరేకించి ఝలక్ ఇచ్చారు.