మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారులో ఈ మధ్యనే మంత్రులకు బాధ్యతలు దక్కాయి. ఏకకాలంలో జంబో కేబినెట్(Fulpledge Cabinet) ప్రకటించి ఆశ్చర్యపరిచింది కమలం(Saffron) పార్టీ. అందులో ఒకరిద్దరు మినహా ఇంచుమించు అందరూ బాధ్యతలు చేపట్టారు. అయితే మోదీ కేబినెట్లో ఎంతమంది కోటీశ్వరులున్నారనే దానిపై సర్వే సంస్థ ADR నివేదిక ప్రకటించింది.
99 శాతం మంది…
మోదీ కేబినెట్లో 99 శాతం మంది కోటీశ్వరులేనని ADR(Association For Democratic Reforms) రిపోర్ట్ ద్వారా తేలింది. 71 మందిలో 70 మంది కోటీశ్వరులేనని తెలిపింది. మంత్రుల ఆస్తుల సగటు రూ.107.94 కోట్లు కాగా ఆరుగురి ఆస్తులు రూ.100 కోట్లకు పైమాటేనట. ఇక 80 శాతం మంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ కలిగి ఉండగా, 15 శాతం మంది 12వ తరగతి వరకు చదువుకున్నారు.
క్రిమినల్ కేసుల్లోనూ…
39%తో 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులుండగా అందులో 19 మందిపై హత్యాయత్నం, మహిళలపై వివక్ష, విద్వేష ప్రసంగాలున్నట్లు ADR తెలిపింది. పోర్టులు, షిప్పింగ్ మంత్రి శంతను ఠాకూర్, విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ పై హత్యాయత్నం కేసులున్నాయంది. ఈ ఇద్దరితోపాటు బండి సంజయ్, సురేశ్ గోపి, జ్యూయల్ ఓరమ్ పై కేసులున్నాయని రిపోర్ట్ లో తెలిపింది.