
బిహార్లో రేపు జరిగే కౌంటింగ్ లో ఓడితే రణరంగమేనంటూ RJD నేత సునీల్ సింగ్ మాట్లాడటం వివాదస్పదంగా మారింది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక పరిస్థితే ఇక్కడా ఉంటుందని రెచ్చగొట్టారు. ‘2020లో చాలామంది మా వాళ్లు అలాగే ఓడారు.. కౌంటింగ్ అధికారులందర్నీ హెచ్చరిస్తున్నా.. మీరు ఎవర్నైతే ఓడిస్తారో అక్కడ నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో రోడ్లపైకి వస్తారు.. తేజస్వియాదవ్ ఆధ్వర్యంలోనే సర్కారు వస్తుంది.. 140-160 సీట్లు సాధిస్తాం..’ అన్న కామెంట్స్ పై DGP ఆదేశాలతో ఆయనపై కేసు నమోదు చేశారు.