
RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించిన దృష్ట్యా ముందుగా ఆ బిల్లును గవర్నర్ కు పంపించారు. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదానికి పంపినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గాను సదరు బిల్లుకు గవర్నర్ అనుమతి కావాల్సి ఉందని సర్కారు భావిస్తోంది. అయితే ఇంకా గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.