యూపీ CM యోగి ఆదిత్యనాథ్ ను పొగిడిన MLAపై సమాజ్ వాదీ పార్టీ వేటు వేసింది. MLA పూజాయాదవ్ భర్త రాజు పాల్ ను 2005లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కాల్చి చంపాడు. పెళ్లయిన కొద్దిరోజులకే రాజకీయ కక్షకు భర్తను కోల్పోయారామె. అతీక్ సోదరుడు అష్రాఫ్ ను 2004 ఉప ఎన్నికల్లో రాజు ఓడించడంతోనే హత్యకు గురయ్యారు. 2023లో అతీక్, అష్రాఫ్ ను అరెస్టు చేసి తరలిస్తుండగా దుండగులు కాల్చి చంపారు. తర్వాత అతీక్ కొడుకు ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. తన భర్తను చంపిన వ్యక్తిని మట్టిలో కలిపారని, క్రిమినల్స్ ను వదిలిపెట్టట్లేదంటూ అసెంబ్లీ సమావేశాల్లో యోగిని పూజాయాదవ్ ప్రశంసించారు. ఆగ్రహించిన SP చీఫ్ అఖిలేశ్.. MLAను పార్టీ నుంచి బహిష్కరించారు. దళిత మహిళపై సమాజ్ వాదీ దాష్టీకమంటూ BJP మండిపడింది.