ఎన్నికలు వస్తున్నందున ఇక కేసీఆర్ జిమ్మిక్కులు స్టార్ట్ అవుతాయని ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. జీవితంలో ఎన్నడూ చూడనన్ని డ్రామాలు కేసీఆర్ చూపిస్తారని అన్నారు. PRC, BCలు, రైతులు, నిరుద్యోగులు అంటూ మళ్లీ డ్రామాలు మొదలు పెడుతున్నారన్నారు. ‘పేరుకే PRC.. అది అమలైతే కదా’ అని ఛమత్కారంగా మాట్లాడారు. బీసీ కులాలను ఎటూగాకుండా చేసి ఇప్పుడు BCలు గొప్పోళ్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. BJP రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. PRC వేసినా అది అమలు కాబోదని, ప్రగతి భవన్ లో గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తుందన్నారు. బండి సంజయ్ లాంటి వాళ్లు వస్తారు, పోతారు.. నాయకులు కాదు పార్టీయే ముఖ్యమంటూ తనను ఉద్దేశిస్తూ కార్యకర్తలు చేసిన నినాదాలపై సంజయ్ స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీ ఆదర్శనీయ వ్యక్తి అని, ఆయన ఫొటో పెట్టుకుని గెలుస్తున్నామన్నారు. బూత్ స్థాయికి వచ్చి ప్రచారం చేసేది మోదీయో, సంజయో కాదని కేవలం కార్యకర్తలదే ఆ క్రెడిట్ అన్నారు. TSPSC కోసం కొట్లాడితే దొంగ కేసులు పెట్టి తనను జైలుకు పంపారని.. ఎంతోమంది కార్యకర్తలు పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు.