అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదని MP బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. హైకమాండ్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. కరీంనగర్ లో మాట్లాడిన ఆయన… ‘నేను ఎక్కడ పోటీ చేయాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది.. దానిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సి ఉంది.. MPలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న చర్చయితే ఇప్పటివరకు జరగలేదు’ అని సంజయ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక సెగ్మెంట్ నుంచి బండి సంజయ్ బరిలోకి దిగుతారని ముందునుంచీ ప్రచారం సాగింది. అది కరీంనగరా, వేములవాడనా అన్నది ఆయనే డిసిషన్ తీసుకోవాల్సి ఉందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతి కొద్దికాలంలోనే జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో సంజయ్ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఇప్పటివరకైతే తనకేమీ తెలియదని జవాబిచ్చారు.
మరోవైపు BRS, కాంగ్రెస్ పార్టీలపై ఆయన ఫైర్ అయ్యారు. సర్కారు ఖజానా దివాళా తీసిందని, ప్రభుత్వాన్ని నడపాలంటే డబ్బులు లేనందునే ముందస్తు లిక్కర్ టెండర్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ అప్లికేషన్లు తీసుకోవడం చూస్తే అది పూర్తిగా డబ్బుల కోసమేనని అర్థమవుతుంది అని సంజయ్ కామెంట్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోబోమని సంజయ్ మరోసారి స్పష్టం చేశారు.