ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నా గురువు అన్న.. ఆయన్ను చూడాలని ఉంది.. ఏం జరుగుతుందన్నా.. అంటూ కరీంనగర్ MP బండి సంజయ్ అనడంతో బహిరంగసభ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎప్పుడూ KCRపై విరుచుకుపడే సంజయ్ ఒక్కసారిగా అలా మాట్లాడటంతో అందరిలోనూ ఆశ్చర్యం కనిపించింది. అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. వచ్చేది మోదీ రాజ్యమంటూ మాట్లాడిన ఆయన.. BRSకు ఎందుకు ఓటేయ్యాలె.. 5 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ కు ఎందుకు ఓటెయ్యాలే అంటూ విమర్శించారు.
‘కేసీఆర్ సర్ ఏమైండో’ అంటూ కామెంట్స్
‘కేసీఆర్ సార్ కనవడుతుండా మీకు.. కనవడుతుండా.. ఏమైందే.. ఏమైందే కేసీఆర్ సర్.. గురువన్నా కేసీఆర్ సర్ నా గురువన్నా.. కేసీఆర్ సర్ దగ్గర భాష నేర్చుకున్నా అన్న.. నా గురువు బాగుండాలని కోరుకోవాల్నా లేదా.. అందుకే మళ్ల చెబుతున్నా.. ఆదిలాబాద్ గడ్డ నుంచి చెబుతున్నా.. కేసీఆర్ సర్ కు రక్షణ కల్పించండి.. ఆయన్ను మాకు చూపెట్టండి.. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని మేం కోరుకుంటున్నం.. మా ముఖ్యమంత్రి మాగ్గావాలే.. మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కొడుకు ఏంజేస్తుండో.. ఇప్పటికీ భయం భయంగా ఉందన్న నాకు.. కేసీఆర్ సర్ ఉండాలన్నా.. ఎప్పుడూ ఏ మనిషి నాశనం కోరుకోమన్న మేం.. అంటూ మాట్లాడటంతో అందరూ ఆసక్తిగా విన్నారు.