కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటిలో మంచి పథకాలుంటే కొనసాగిస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. ధరణి మంచిదే కానీ సీఎం కుటుంబానికే పనికొస్తోందని, అందులో మార్పులు చేసి కంటిన్యూ చేస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవాళ్లు మాత్రమే టీఆర్ఎస్ కు వెళ్తారు.. మా పార్టీ నుంచి ఎవరూ వెళ్లరని చెప్పారు. మోదీ హైదరాబాద్ వస్తున్నారంటేనే సీఎంకు వణుకు.. కాంగ్రెస్ లో 30 మంది అభ్యర్థులను కేసీఆరే డిసైడ్ చేస్తారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పటికే క్యాండిడేట్లను డిసైడ్ చేసిన సీఎం వారికి డబ్బులు ఇస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కర్ణాటకలో హస్తం పార్టీకి సాయం చేసింది బీఆర్ఎసే అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డే చెప్పారని సంజయ్ గుర్తు చేశారు.
Related Stories
December 22, 2024
December 21, 2024