మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR)పై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫార్ములా ఈ-కార్ రేసు విచారణ విషయంలో గవర్నర్ అనుమతించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. KTRపై విచారణ విషయం కేబినెట్ భేటీలో ప్రధాన చర్చగా నిలిచింది. గవర్నర్ పర్మిషన్ ఇవ్వడంతో ఇక చట్టప్రకారం ACB దర్యాప్తు చేస్తుందని మంత్రి తెలిపారు. విచారణలో ఎక్కడా సమస్యలు రాకుండా ఉండేందుకు న్యాయ నిపుణుల(Legal Experts) సలహాలు తీసుకున్న సర్కారు.. వారి సూచనల ఆధారంగా గవర్నర్ కు లెటర్ ను పంపింది.
గవర్నర్ సంతకం చేసిన ప్రతిని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ACBకి అందజేసిన తర్వాత విచారణ మొదలవుతుంది. అయితే కేటీఆర్ ను అరెస్టు చేస్తారా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకుండా అది తనకు తెలియదని దాటవేశారు.ఈ మాజీ మంత్రితోపాటు ఫార్ములా రేస్ విషయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ IAS అర్వింద్ కుమార్ పైనా విచారణ జరగనుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనపడుతున్నదన్న ఊహాగానాలు వినపడుతున్నాయి.