కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న కోణంలోనే సోనియా, రాహుల్ తో భేటీ జరిగిందని YSRTP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. నాతో నడిచిన వారందరినీ నాతో పాటు నిలబెడతానని, కాంగ్రెస్ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలిపారు. చర్చలు తుది దశకు వచ్చాయని, అవి కొలిక్కి రాగానే అందరికీ తెలియజేస్తామన్నారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని తన తండ్రి విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు.
రాజశేఖర్ రెడ్డి పేరు FIRలో చేర్చిందే సోనియా అన్న ప్రచారం ఉందని, కానీ ఇది జరిగి 14 ఏళ్లయిందన్న షర్మిల.. వాస్త వానికి తన తండ్రిపై సోనియా, రాహుల్ లకు అపారమైన గౌరవం ఉందన్నారు. అది గుర్తించే వారితో చర్చలు జరిపేందుకు వెళ్లానన్నారు.