మహారాష్ట్రలో మహాయుతి పంచాయితీ అంతిమ దశ(Final Stage)కు చేరుకుంది. ఇప్పటిదాకా BJP-శివసేన వర్గాలు బెట్టు చేయడంతో ఉత్కంఠగా మారిన పదవి గురించి CM ఏక్ నాథ్ షిండే పెదవి విప్పారు. కమలం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మోదీ, అమిత్ షా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, మహారాష్ట్ర CM ఎవరో ఆ ఇద్దరే స్పష్టం చేస్తారని తెలిపారు. అంతకుముందు షిండేతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
షిండే పెద్దరికం హుందాగా నిర్ణయం తీసుకోవాలి అతిపెద్ద పార్టీగా బీజేపీ కే అవకాశం ఇవ్వాలి