గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ గుర్తుతో గెలిచిన చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య.. కారుకు బై బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. CM సమక్షంలో ఢిల్లీలో కండువా కప్పుకున్నారు. పార్టీ వీడి వెళ్లిపోయిన ఆరో MLA కాలె యాదయ్య. BRS వీడి వెళ్లిపోయిన ఆరో MLA కాలె యాదయ్య. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీతోపాటు రేవంత్ రెడ్డి ఆయనకు కండువా వేశారు.
ఆరో సభ్యుడు…
ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల MLAలు వరుసగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ ఇప్పటికే హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరికి తోడుగా చేవెళ్ల MLA సైతం జతకలిశారు.