తమిళనాడు(Tamilnadu) CM స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన కమిటీని ప్రకటించారు. కేంద్రంతో సంబంధాలు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, తమిళనాడు హక్కులపై కమిటీ నివేదిక ఇస్తుందని స్టాలిన్ తెలిపారు. మాజీ ఉన్నతాధికారులు అశోక్ శెట్టి, ఎంయూ నాగరాజన్ సభ్యులుగా ఉంటారు. 2026 జనవరిలో మధ్యంతర(Interim) నివేదిక, 2028 నాటికి పూర్తిస్థాయి రిపోర్ట్ అందుతుందని CM అన్నారు. కేంద్రం-గవర్నర్-తమిళనాడు సర్కారు మధ్య వివాదం నడుస్తోంది. గత ఐదేళ్లుగా 10 బిల్లుల్ని గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆపేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.