రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారుల(Players)కు ఉద్యోగాలు ప్రకటించింది. రాష్ట్ర ఉన్నతాధికారులుగా విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లలకు రేవంత్ సర్కారు ఉద్యోగాలు కేటాయించింది.
మంత్రివర్గ నిర్ణయాలిలా…
* క్రీడాకారులు ఈశా సింగ్, మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పున స్థలం(Land)
* క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం
* ఇంటెలిజెన్స్ DG రాజీవ్ రతన్ తనయుడు హరిరతన్ కు మున్సిపల్ కమిషనర్ పోస్ట్
* విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అడిషనల్ DG పి.మురళి తనయుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం
* గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల ద్వారా 2 లక్షలకు నీరిచ్చేందుకు రివైజ్డ్ ఎస్టిమేట్ కు ఆమోదం
* కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను MLCలుగా సిఫార్సు చేస్తూ గవర్నర్ కు ఫైల్
* మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీరు హైదరాబాద్ తరలింపు
* 5 TMCలు హైదరాబాద్ తాగునీటికి, మరో 10 TMCలు భాగ్యనగరం చుట్టు పక్కల చెరువులకు తరలింపు
* తొలుత షామీర్ పేట చెరువు నింపి ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలింపు