కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న ఆయన్ను నిలువరించారు. హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో ప్రభుత్వం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించింది. దీనిపై BJP పోరుబాట పట్టింది. ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి.. ఎన్ని పూర్తయ్యాయి.. పేదలకు ఇచ్చేది ఎంత అనే విషయాల్ని పరిశీలించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ బాటసింగారం వెళ్లేందుకు కిషన్ రెడ్డి, రఘునందన్ రావు సహా పార్టీ నాయకులతోపాటు పెద్దయెత్తున కార్యకర్తలు బయల్దేరారు. అయితే దిల్లీ నుంచి వస్తున్న కిషన్ రెడ్డి ఫ్లైట్ దిగి శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధి దాటగానే ఇక్కడి పోలీసులు అడ్డుకున్నారు.
ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్డు ముగియగానే కిషన్ రెడ్డిని నిలువరించడంతో.. పోలీసు అధికారులతో రఘునందన్ వాగ్వాదానికి దిగారు. పోలీసు వెహికిల్స్ కదలకుండా కమలం పార్టీ కార్యకర్తలు బైఠాయించారు.