కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ(Teacher) శాసనమండలి సభ్యుడిగా మల్క కొమురయ్య విజయం సాధించారు. BJP మద్దతు అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన… ముందునుంచీ ఆధిక్యంలో ఉంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు. విజయానికి 12,073 ఓట్లు కావాల్సి ఉండగా.. కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. మొత్తం 25,041 ఓట్లు పోలైతే అందులో చెల్లనివి 897. దీంతో 24,144 ఓట్లకు గాను కొమురయ్యకు 12,959.. వంగ మహేందర్ రెడ్డికి 7,182.. అశోక్ కుమార్ కు 2,621.. కూర రఘోత్తమ్ రెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ MLCగా PRTU అభ్యర్థి పింగలి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. అక్కడ 23,641 ఓట్లు చెల్లుబాటయ్యాయి. గెలుపు కోటా ఓట్లు 11,822గా నిర్ధారించగా.. 494 చెల్లకుండా పోయాయి. తొలి ప్రయారిటీలో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో శ్రీపాల్ రెడ్డి విజయం అందుకున్నారు. శ్రీపాల్ రెడ్డి 11,099.. సిట్టింగ్ MLC, ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచిన అలుగుబెల్లి నర్సిరెడ్డి 8,448 ఓట్లు దక్కించుకున్నారు.
రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న మల్క కొమురయ్య