త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(BJP) దిద్దుబాటు మొదలుపెట్టింది. రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న భేటీకి ఇంఛార్జిలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ రాగా.. MPలు, MLCలు MLAలు హాజరయ్యారు. నిజానికి తెలంగాణలో అద్భుత కేడరున్నా నాయకత్వంలోనే సఖ్యత లేదన్న భావన ఉంది. పలువురిపై MLA రాజాసింగ్ నేరుగా విమర్శలు చేస్తూ, ఇతర పార్టీలతో అంటకాగే తీరును ప్రశ్నించారు. ఇటు కాళేశ్వరం కమిషన్ కు ఈటల హాజరుకావడం, మరికొందరు నేతల మౌనంతో పార్టీలో అయోమయం ఏర్పడిందన్న చర్చల నడుమ.. బన్సల్, పాటిల్ ఏం చేస్తారో చూడాలి.