రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రా, రీజినల్ రింగ్ రోడ్, ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్కు వంటి వాటిని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిర్ణయాలివే…
* రీజినల్ రింగ్ రోడ్(RRR) దక్షిణ భాగం ఎలైన్మెంట్ ఖరారుకు 12 మందితో కమిటీ ఏర్పాటవుతుంది. కన్వీనర్ గా R&B ముఖ్య కార్యదర్శితోపాటు మున్సిపల్, రెవెన్యూ కార్యదర్శులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
* ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు బదలాయింపు
* తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుకు 72 ఎకరాల బదలాయింపు
* రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలకు 3 వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్
* కోస్గిలో ఇంజినీరింగ్, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరు
* SLBC టన్నెల్ పనులకు సవరించిన అంచనాలతో రూ.4,637 కోట్లు మంజూరు
* ఈ ఖరీఫ్ నుంచే క్వింటాలు సన్నాలకు MSPపై రూ.500 అదనపు చెల్లింపునకు రూ.2,500 కోట్లు వెచ్చింపు
* పోలీసు ఆరోగ్య భద్రత స్కీంను SPL కింద వర్తింపజేయాలని నిర్ణయం