మూడు గంటల పాటు సాగిన రాష్ట్ర మంత్రివర్గ(Cabinet) సమావేశం(Meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 169 మంది అధికారులు, 946 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు.