పెట్రోలు బంకుల్లో జరిగే మోసాల(Cheatings)పై నిఘా పెట్టాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెట్(EODB) చట్టం పేరుతో కస్టమర్ల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఆ శాఖపై రివ్యూ నిర్వహించిన ఉత్తమ్.. రెగ్యులర్ గా తనిఖీలు(Inspections) నిర్వహించాలన్నారు.
పెట్రోలు బంకులతోపాటు వేయింగ్ మిషన్లపై కన్ను వేయాలని, తద్వారా ప్రజలు మోసాల బారి నుంచి బయటపడతారన్నారు. తూనికలు, కొలతల శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వాస్తవానికి చాలా చోట్ల అక్రమాలే కనిపిస్తాయి. సరైన సిబ్బంది లేరన్న కారణంతో ఈ శాఖ.. ఎప్పుడో గానీ తనిఖీలు చేయడం లేదు. మరి మంత్రి ఆదేశాలతోనైనా స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.