రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే మంతనాలు పూర్తి కాగా.. ఉగాది తర్వాత కొత్త మంత్రులు వచ్చే అవకాశముంది. నూతన మంత్రుల బాధ్యతల స్వీకారం ఏప్రిల్ తొలి వారంలో ఉండే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్, PCC చీఫ్ మహేశ్ కుమార్, సీనియర్ ఉత్తమ్ తో పార్టీ పెద్దలు చర్చించారు. నిన్న(మార్చి 24న) రాహుల్, ఖర్గే, వేణుగోపాల్.. నేతల్ని పిలిపించి మాట్లాడారు. ప్రస్తుతానికి ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే అందులో నలుగురైదుగురికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. CM రెడ్డి సామాజికవర్గమైతే, PCC చీఫ్ BC వ్యక్తి. దీంతో కొత్త పదవులు ఏ కమ్యూనిటీ నుంచి ఉంటాయోనన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.