రెండు నెలల పాటు సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు తుది విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడో దశ(Seventh Phase)లో 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ విడతలో బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 543 స్థానాల(Constituencies)కు ఎన్నికలు జరుగుతుండగా గత ఆరు దశల్లో 486 సెగ్మెంట్లకు పోలింగ్ పూర్తయింది.
ఈరోజు ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లో అత్యధికంగా 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 9, బిహార్లో 8 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఈ సాయంత్రానికి ముగుస్తుంది. చివరి దశ పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) నిషేధం విధించింది.
CEC విధించిన నిషేధం గడువు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ముగుస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలపై ఈ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలుకానుంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఓటింగ్ జరగ్గా.. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతోపాటు లోక్ సభ స్థానాలకు అదే రోజు ఓటు వేశారు.