
పరిస్థితిని పరిశీలించేందుకు విపక్ష కూటమి ‘I.N.D.I.A.’ ఎంపీలు నేడు మణిపూర్ లో పర్యటించనున్నారు. 20 మంది MPలు ఇవాళ, రేపు రెండు రోజులు అక్కడే ఉంటారు. జాతుల ఘర్షణలు, మారణ హోమాలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీనిపై ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేయాలంటూ ‘I.N.D.I.A.’ కూటమి వర్షాకాల సమావేశాల్లో డిమాండ్ చేసింది. ‘నో కాన్ఫిడెన్స్ మోషన్’ కూడా ప్రవేశపెట్టింది. ఈ సమయంలో విపక్షాలకు చెందిన MPలు అక్కడ పర్యటించి బాధితులను కలుసుకోనున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్లలో తలదాచుకుంటున్న వారిని పరామర్శించనున్నట్లు విపక్ష కూటమి తెలిపింది.
దీనిపై ఇప్పటికే చర్యలను వేగవంతం చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మహిళల నగ్న ఊరేగింపు, గ్యాంగ్ రేప్ అంశంపై అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం మొత్తం నిందితులందర్నీ అరెస్టు చేస్తామని వివరించింది.
All the best