ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు అన్ని విషయాలు చెప్పానని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. KCRకు బంధాలు, బంధుత్వాలతో సంబంధం లేదని… CM రేవంత్, హరీశ్ రావు, కవిత, ఆమె భర్త ఫోన్లూ ట్యాప్ చేశారన్నారు. చివరకు TGPSC పేపర్ లీక్ కేసును విచారించిన జడ్జి ఫోన్ ట్యాప్ అయిన విషయం తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. అప్పటి BRS మంత్రులు, కీలక నేతలతోపాటు ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లనూ వదల్లేదన్నారు. KCR కుమార్తె, ఆమె భర్తను సైతం విచారణకు పిలవాలన్నారు. KCR, KTR, సంతోశ్ రావు మినహా అందరూ బాధితులేనని సంజయ్ గుర్తుచేశారు.