బీజేపీ-కాంగ్రెస్ పొలిటికల్ వార్ జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కామెంట్స్ ప్రకంపనలు(Vibrations) రేపుతున్నాయి. రెండు పార్టీల లీడర్లు మొన్నటి ఎన్నికల్లో ఎంతటి ఆరోపణలు చేసుకున్నారో చూశాం. మోదీ, రాహుల్, ఖర్గే వంటి నేతలు ప్రత్యర్థి పార్టీల సిద్ధాంతాల్ని ఎండగట్టారు. ఇలాంటి వాతావరణంలో కేంద్రమంత్రి సురేశ్ గోపి సంచలన(Sensational) కామెంట్స్ చేశారు.
ప్రత్యర్థి లీడర్ ను…
కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా సంబోధించి కలకలం రేపారు. కాంగ్రెస్ దివంగత(Late) CM కె.కరుణాకరన్ ను ధైర్యవంతుడైన పరిపాలకుడిగా అభివర్ణిస్తూ ఆయనతోపాటు వెటరన్ లీడర్ ఇ.కె.నాయర్ తన రాజకీయ గురువు(Political Gurus)లని ఆ ఇద్దరి ప్రభావం తనపై ఎంతో ఉందన్నారు.
గురువు ఫ్యామిలీనే…
కేరళ త్రిస్సూర్ నుంచి గెలుపొందిన సురేశ్… తన విజయానికి గుర్తుగా నివాళులర్పించేందుకు పున్కున్నమ్(Punkunnam)లోని కరుణాకరన్ స్మారకమైన మురళి మందిరాన్ని విజిట్ చేశారు. ఏప్రిల్ 26 నాటి ఎన్నికల్లో ఈ సినీనటుడు తన గురువైన కరుణాకరన్ తనయుడు కె.మురళీధరన్ ను మూడో స్థానానికి నెట్టి కేరళ నుంచి గెలిచిన ఏకైక MPగా నిలిచారు. సహాయ హోదాలో పెట్రోలియం, సహజవాయువుల మంత్రిగా ఈయనకు పదవి దక్కింది.
స్వరాష్ట్రంలో రచ్చ…
ఇందిర, కరుణాకరన్ విధానాలు దేశంపై ఎంతగానో ప్రభావం చూపాయన్న ఈయన కామెంట్స్ సొంత రాష్ట్రంలోనే రచ్చకు దారితీశాయి. దీంతో తన మాటలను పార్టీల పరంగా చూడొద్దంటూ ఈ కేంద్రమంత్రి వివరణ ఇచ్చుకున్నారు. కరుణాకరన్ ఫ్యామిలీతో ఇప్పటికీ తనకు మంచి సంబంధాలున్నాయన్నారు.