18వ లోక్ సభకు ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణం(Oath) చేయించారు. ఇవాళ, రేపు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. ప్రస్తుత సభలో సగం కొత్తగా ఎన్నికైనవారే ఉన్నారు. 543 మంది మెంబర్స్ లో తొలిసారి 280 మంది ఎన్నికయ్యారు. 17వ సభలో ప్రాతినిధ్యం వహించి ఈ సభకు వచ్చిన వారు 216 మంది ఉన్నారు.
ఆ ఇద్దరూ…
ఈ సభలో 41 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటే BJP-240, కాంగ్రెస్-99, సమాజ్ వాదీ-37, తృణమూల్ కాంగ్రెస్-29, DMK-22 తొలి ఐదు స్థానాల్లో(Top Five) ఉన్నాయి. మొత్తం సభ్యుల్లో 74 మంది మహిళా MPలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులూ మాతృభాషలోనే ప్రమాణస్వీకారం చేశారు. బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ మాతృభాష(తెలుగు)లో ప్రమాణం చేశారు.