మోదీ తర్వాత కాబోయే ప్రధాని(PM Aspirant) అన్న ఊహాగానాలపై UP CM యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాను ఒక యోగినని గుర్తుచేసిన ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్ ప్రజలకు సేవ చేయడమే పరమార్థమన్నారు. ఇంకా ఏమన్నారంటే…
‘నేను ముఖ్యమంత్రిని.. UP ప్రజల సేవకు పార్టీ నన్ను CM చేసింది.. రాజకీయాలు నా ఫుల్ టైమ్ జాబ్ కాదు.. నేను ఒక యోగిని.. కేంద్ర పెద్దలతో భేదాలున్నాయన్న ప్రచారం తప్పు.. పార్టీ వల్లే నేనీ స్థానంలో ఉన్నా.. ఇక ఎందుకు భేదాలుంటాయ్.. ఒకవేళ ఉంటే నేనిక్కడ(CM సీట్లో) ఉండగలనా.. బుల్డోజర్ కూల్చివేతలు నా గొప్ప కాదు.. ఇది UPకి ఎంతో అవసరం.. ఎక్కడ ఆక్రమణలున్నా బుల్డోజర్లు దింపడమే.. ప్రజల కోసం తెచ్చిన గొప్ప విధానమిది.. దీన్నెలా వాడాలో ఇంకా బాగా ఆలోచిస్తున్నాం..’. మరిన్ని వార్తలకు https://justpostnews.com క్లిక్ చేయండి.