ఘోర ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తనకు రాచమర్యాదలు కల్పించడంపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ CM సీరియస్ అయ్యారు. రాచమర్యాదలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ను ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్(Brajesh Pathak) ఆదేశించారు. ఝాన్సీ పట్టణంలోని హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది శిశువులు(New Borns) దుర్మరణం పాలైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీకి వెళ్తున్న సమయంలో.. మంత్రి రాకకు గుర్తుగా రోడ్డుకిరువైపులా పౌడర్ చల్లారు. దీనిపై UP ప్రతిపక్షాలు యోగి సర్కారుపై విమర్శలు గుప్పించాయి. ఒకవైపు పిల్లలు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే తనకు రాచమర్యాదలు చేయడమేంటని ఆగ్రహించిన మంత్రి.. సదరు వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించారు.