నల్గొండ MP ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక కామెంట్స్ చేశారు. తాను, తన సతీమణి పోటీచేసే నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీ తగ్గితే పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెడతానని అన్నారు. ఈసారి హుజూర్ నగర్, కోదాడ సెగ్మెంట్లలో సత్తా చూపిస్తామని, 50 వేలకు ఏ మాత్రం తగ్గకుండా చూస్తామన్న ఆయన.. దీన్ని నిజం చేయకపోతే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. KCR, KTR కలల్లో బతుకుతున్నారని, కాంగ్రెస్ ఉప్పెనలో BRS కొట్టుకుపోతుందని ఉత్తమ్ అన్నారు. ల్యాండ్, శాండ్, లిక్కర్, కరప్షన్ మాఫియాలో BRS ఎమ్మెల్యేలు బతుకుతున్నారని, అన్ని రంగాలను నాశనం చేసిన ఘనత ఆ పార్టీదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
వీలైనంత త్వరగా టికెట్ల ప్రకటన చేయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందుకోసం AICCని కోరుతానన్నారు. బండి సంజయ్ పనైపోయిందని, ఇక సంజయ్, ఈటల, కిషన్ రెడ్డి తమ పంచాయతీని తేల్చుకోవాలంటూ BJPకి చురకలు వేశారు. తామిద్దరం హుజూర్ నగర్, కోదాడ కోసం అప్లయ్ చేశామని, AICC నిబంధనల ప్రకారమే టికెట్లు వస్తాయన్నారు.