అధికార BRS పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్ని నమ్మవద్దని, తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని PCC మాజీ అధ్యక్షుడు(Ex President), నల్గొండ MP ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లోని కీలక లీడరే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన గురించి సోషల్ మీడియాలో ఫాల్స్ ప్రచారం జరుగుతున్నదని, పార్టీలో తన స్థాయిని తగ్గించే తప్పుడు ప్రచారం మంచిది కాదని విమర్శించారు. కొన్ని విషయాల పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు.. కానీ దాన్నే సాకుగా చూపి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
సోషల్ మీడియా(Social Media)లో వస్తున్న పుకార్లు, ఊహాగానాలను ఖండిస్తున్నానన్న ఉత్తమ్.. సహచరులు, అనుచరులను అణగదొక్కేందుకే ఈ విష ప్రచారమంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇంటర్నల్(Internal) విషయాల గురించి మీడియా లేదా బయట మాట్లాడదలచుకోలేదని, తనకు ఎలాంటి బిజినెస్ లు, ఒప్పందాలు, భూలావాదేవీలు లేవని ఉత్తమ్ తెలిపారు.