ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ హైకోర్టు అనర్హత వేటు వేసిన కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం ‘స్టే’ విధించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అటు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
వనమాపై జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం జులై 25న అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. జలగం వెంకట్రావును MLAగా ప్రకటించింది. దీనిపై మరుసటి రోజే వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించి ఆ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. హైకోర్టు నిర్ణయంతో వనమా వెంకటేశ్వ ర్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. మాజీ MLA జలగం 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు.