మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు.. మరోసారి అదే తీరుతో అలరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన BC డిక్లరేషన్ సభలో.. వేదికపై ఉన్న రేవంత్ రెడ్డితోపాటు ఇతర సీనియర్ లీడర్లందరికీ చురకంటించారు. ముందుగా ఎన్నికల్లో గెలవాలని, ఆ తర్వాతే CM పదవి గురించి ఆలోచించాలన్నారు.
‘ఒకటి నాకు బాధ అయితుంది.. ఎవరికి వారే ముఖ్యమంత్రి అంటరేమ్రా బాబూ.. ఇది తప్పు.. హైకమాండ్ డిసైడ్ జేస్తది.. నాకు 1990లో అవకాశమొచ్చినా మా అధిష్ఠానం నిర్ణయిస్తదని చెప్పిన.. ఎవరికి వారే సీఎం అట.. మాణిక్ రావ్ జీ జర బోలో.. ముఖ్యమంత్రి అంటూ పరేషాన్ అవుతున్నరు.. CMను నిర్ణయించేది సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్.. దయచేసి ఇది బంద్ జేయుండ్రి.. దీనివల్ల మనలో యూనిటీ లేదు.. ఎక్కడికెళ్లి నిర్ణయిస్తర్రా బయ్.. ప్రజలు నిర్ణయిస్తరు.. ముందు ఎలక్షన్ల గెల్వుండ్రి.. ఇక నుంచి ముఖ్యమంత్రి పదవి ఎత్తొద్దు.. ఎవరికి ప్రజల్లో అభిమానం ఉందో వారిని హైకమాండ్ నిర్ణయిస్తుంది’ అంటూ రేవంత్ వైపు వేలు చూపిస్తూ VH మాట్లాడారు. ఈ సీనియర్ లీడర్ కామెంట్స్ తో సభలో నవ్వులు కనిపించాయి.