Published 23 Nov 2023
అవినీతికి దూరంగా ఉంటానని చెప్పుకునే BJP.. కేసీఆర్ కు సపోర్ట్ గా ఉండటం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. BRS వచ్చినా ఏం కాదు కానీ కాంగ్రెస్ రావొద్దన్న ఉద్దేశంతో కమలం పార్టీ ఉందన్నారు. హన్మకొండలో ప్రచారం నిర్వహించిన ఆమె.. BJP తీరును దగ్గరుండి చూశాను కాబట్టే ఆ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరానని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన హస్తం పార్టీ 2014లోనే అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉన్నా అది జరగలేదని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్న KCRకు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోసారి ఓటు వేయకూడదని విజయశాంతి కోరారు. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్న విజయశాంతి.. ఈ మధ్యనే హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు.