భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17నాడు… కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకల్ని నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు వేడుకలు జరగనుండగా… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇందులో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. CRPF ఆఫీసర్స్ స్టాఫ్ మెస్ లో బస చేసిన అమిత్ షా.. అక్కడే రాష్ట్ర లీడర్లతో సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఎలా ముందకెళ్తున్నారనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బూత్ కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు గాను కమిటీలు కోఆర్డినేట్ చేసేవారు బాధ్యతలు కరెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరముందని షా అన్నారు.