27 ఏళ్ల తర్వాత ఢిల్లీపై జెండా ఎగురవేసిన BJP.. ఇక ‘తర్వాతి వంతు బెంగాల్’ అంటూ మాటల దాడి ప్రారంభించింది. కమలం పార్టీకి కొరకరాని కొయ్యలా తయారైన ఢిల్లీ, బెంగాల్లో.. తాజాగా హస్తినను దక్కించుకుని జోష్ లో ఉంది. ఇక నెక్స్ట్ బెంగాల్ మీదే ఫోకస్ పెడుతుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. దాన్ని నిజం చేసింది బెంగాల్ నాయకత్వం. ఢిల్లీ విజయోత్సాహంలో ఉన్న బెంగాల్ నేత సువేందు అధికారి.. మమతను టార్గెట్ చేసుకుని ‘ఇక మీ వంతు’ అని హెచ్చరించారు.
అవినీతి, అబద్ధాలకు ముగింపు ఢిల్లీ విజయమంటూ బెంగాల్ కు కూడా అలాంటి రోజు రాబోతుందన్నారు. ఢిల్లీ మాదిరిగానే తమ రాష్ట్రంలోనూ బంగ్లాదేశ్ రోహింగ్యాలకు ఆశ్రయిమిస్తున్నారని సువేందు ఆరోపించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల విషయంలో కేజ్రీవాల్ మాదిరిగానే మమత ఉన్నారని గుర్తు చేశారు. అందుకే ఇక BJP టార్గెట్ పశ్చిమబెంగాల్ అని స్పష్టం చేశారు.