కాళేశ్వరం నివేదికపై CBI విచారణ.. హరీశ్, సంతోష్ పై కవిత ఆరోపణలు.. KCR, హరీశ్ అత్యవసర పిటిషన్ పై హైకోర్టులో చుక్కెదురు.. ఇలా BRSలో కలకలం కనిపిస్తోంది. అన్నపైనే కవిత అస్త్రాలు అని ఇప్పటిదాకా భావిస్తే.. హరీశ్, సంతోష్ పైనా విరుచుకుపడటం పార్టీని ఇరుకునపెట్టింది. ఆమెకు కౌంటరా అన్నట్లు ‘సింహం సింగిల్ గానే వస్తుంది’ అంటూ పార్టీ ‘X’ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇక KCRను ఎర్రవల్లి ఫాంహౌజ్ లో KTR, హరీశ్, పల్లా, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి కలిశారు. ఒకవైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని కవిత మాట్లాడటం గందరగోళమైంది. ఆమెపై వేటు వేస్తారా అన్న చర్చ నడుస్తోంది.