వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. 209 పరుగులు తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో టీమిండియా 234 పరుగులకు చేతులెత్తేసింది. 164 పరుగులతో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 179 పరుగుల వద్ద విరాట్ కోహ్లి(49) ఔటయ్యాడు. బోలాండ్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే స్కోరు వద్ద మరో రెండు బంతులకు జడేజా డకౌటయ్యాడు. ఈ దశలో అజింక్య రహానే, శ్రీకర్ భరత్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే రహానే(49) స్టార్క్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భరత్(23), షమి(13) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ నాథన్ లైయన్ 4, పేసర్ స్కాట్ బోలాండ్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.