క్రికెట్ ప్రేమికుల్ని అలరించే మరో సమరానికి రంగం సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ లో దాయాది దేశాలైన భారత్-పాక్ తలపడే పోరుకు షెడ్యూల్ ఖరారైంది. మనదేశంలో ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ కు సంబంధించి ముసాయిదా షెడ్యూల్ ను బీసీసీఐ వెల్లడించింది. ఈ షెడ్యూల్ ను ఐసీసీతో పంచుకున్న తర్వాత మిగతా దేశాలకు అందించనున్నారు. ఆయా దేశాల నుంచి ఫీడ్ బ్యాక్ అందిన తర్వాత షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
- అక్టోబరు 5న మెగా టోర్నీ ప్రారంభం… డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ వేదిక
- అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 15న భారత్-పాక్ ఢీ
- భారత్ తొలి మ్యాచ్ ను చెన్నై వేదికగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
- నవంబరు 19న అహ్మదాబాద్ లో ఫైనల్
- మొత్తం పదింటిలో 8 జట్లకు అర్హత… క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్ల నిర్ణయం
భారత్ మ్యాచ్ ల వివరాలు
- అక్టోబరు 8: ఆస్ట్రేలియాతో… వేదిక చెన్నై
- అక్టోబరు 11: అఫ్గానిస్థాన్ తో… వేదిక దిల్లీ
- అక్టోబరు 15: పాకిస్థాన్ తో… వేదిక అహ్మదాబాద్
- అక్టోబరు 19: బంగ్లాదేశ్ తో… వేదిక పుణె
- అక్టోబరు 22: న్యూజిలాండ్ తో… వేదిక ధర్మశాల
- అక్టోబరు 29: ఇంగ్లాండ్ తో… వేదిక లఖ్ నవూ
- నవంబరు 2: క్వాలిఫయర్ తో… ముంబయి
- నవంబరు 5: దక్షిణాఫ్రికాతో… కోల్ కతా
- నవంబరు 11: క్వాలిఫయర్ తో… బెంగళూరు