ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. సెంచరీతో చెలరేగడంతో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మూడో రోజు మధ్యాహ్నం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు… ఆదిలోనే రోహిత్(19) వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన గిల్ తో కలిసి యశస్వి… ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్స్ లతో హోరెత్తిస్తూ తక్కువ బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు.
హాఫ్ సెంచరీ తర్వాత…
అర్థసెంచరీ(Fifty) తర్వాత యశస్వి దూకుడుతో ఆడాడు. హాఫ్ సెంచరీకి 80 బాల్స్ తీసుకుంటే మరో ఫిఫ్టీని కేవలం 42 బంతుల్లోనే పూర్తి చేశాడు. 5 సిక్స్ లు, 9 ఫోర్లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి.. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ కు దీటుగా బదులిచ్చాడు. మరో ఎండ్ లో శుభ్ మన్ గిల్ సైతం స్పీడ్ పెంచాడు.