వన్డే వరల్డ్ కప్ లో విచిత్రం చోటుచేసుకుంది. కేవలం 2 బంతుల్లోనే 21 రన్స్ ఇచ్చిన ఘటన న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో జరిగింది. టాస్ గెలిచిన కివీస్ తొలుత ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ ముూడో ఓవర్ లో విచిత్రం జరిగింది. ఫస్ట్ బాల్(2.1 ఓవర్) ను డేవిడ్ వార్నర్ సిక్స్ కొట్టాడు. రెండోది(2.2 ఓవర్) నోబాల్ కావడం, వార్నర్ సింగిల్ తీయడంతో రెండు రన్స్ వచ్చాయి. తర్వాతి బాల్ ను ఫ్రీ హిట్ తో ట్రావిస్ హెడ్ సిక్స్ గా మలిచాడు. చూస్తే అది కూడా నోబాలే. దీంతో ఆ బాల్ కు(సిక్స్, నోబాల్ తో కలిపి) 7 రన్స్ వచ్చాయి. రెండోసారి ఫ్రీహిట్ అవకాశంతో హెడ్ మళ్లీ సిక్స్ కొట్టడంతో కేవలం రెండు బంతుల్లోనే 21 పరుగులు ఇవ్వాల్సి వచ్చింది.
మొత్తంగా ఓవర్లో 22 రన్స్
తర్వాతి మూడు బాల్స్ ను డాట్స్ గా వేసిన హెన్రీ… లాస్ట్ బాల్ ను వైడ్ గా వేశాడు. దీంతో ఇంకో రన్ రాగా.. అదనంగా మరో బాల్ వేయాల్సి వచ్చింది. ఇలా ఒకే ఓవర్లోనే 22 పరుగులు రావడం సాధారణమే(Common) అయినా కేవలం రెండు బంతుల్లోనే 21 రన్స్ రావడం విశేషంగా నిలిచింది.